చత్రపతి శివాజీ ఫిబ్రవరి 19, 1630లో పూణే జిల్లాలోని శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు.

శివాజీ పుట్టడానికి ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా వారు పూజించే దేవత శివై పార్వతికి సంబంధించి 'శివాజీ' పేరు పెట్టారు.

శివాజీ 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిని తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు.

మరో మూడేళ్లలో కొండన, రాజ్ ఘడ్ కోటలను సొంతం చేసుకొని.. పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

1660లో ఔరంగజేబు చేతిలో ఓటమి. బలమయిన ఔరంగజేబు సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు.

నాసిక్ నుంచి మద్రాసు వరకు ఉన్న జింగీ వరుక 1200 కిలోమీటర్ల మధ్య దాదాపు 300 కోటలను నిర్మించిన శివాజీ.

 శివాజీ భవాని దేవి భక్తుడు. కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే కాకుండా.. ఎన్నో మసీదులు కూడా కట్టించారు.

1664 సూరత్ యుద్ధం  తర్వాత మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకున్నాడు.