ఈ బిజీ లైఫ్ లో ఏదీ తిన్నా గబగబా తినడం చేస్తూ ఉంటాం. దీని ద్వారా అనేక సమస్యలు రావచ్చు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ చిట్కాలను, నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
హడావిడిగా తినకుండా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా, నిదానంగా తినండి. తొందర తొందరగా తింటే అసలు ఎంత తిన్నాం అనేది తెలియకపోగా, తిన్న దాని రుచిని ఆస్వాదించే అవకాశాన్ని కూడా కోల్పోతాం.
హడావుడిగా తినడం ద్వారా ఎంత తింటున్నామనే విషయం తెలియదు. మరోవైపు గాలి కూడా లోపలికి వెళ్లిపోతుంది. కొద్దిసేపటికే ఆకలేసేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బాగా నమిలి తినడం మంచిది
మంచిగా నమిలి తినడం వల్ల లాలాజల గ్రంథులు కూడా చురుగ్గా మారుతాయి. బాగా నమలడం ద్వారా ఆహారం మెత్తగా మారి జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది.
శరీరంలో మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి.
ఆహారాన్ని బాగా నమిలి తినడం ద్వారా ఆహారంలోని పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి బరువు తగ్గడం సాధ్యమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
అన్నం తినేముందు ఒక ఐదు నిముషాలు విరామం తీసుకొని తినబోయే దాని గురించి కాస్త ఆలోచించండి. అప్పుడు మనం అన్నం తినడానికి సంసిద్ధులవుతున్నామని మన మెదడుకి సమాచారం అందుతుంది.
తినే ముందు భోజనం గురించి ఆలోచించడం వల్ల శరీరం కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. దాని ద్వారా తమకు తినాలనే కోరిక కూడా కలుగుతుంది.