ఆచార్య చాణక్యుడి ప్రకారం.. లక్ష్మీ దేవి కొన్ని ఇళ్లలో ఉండటానికి ఇష్టపడదు.
పరిశుభ్రత లేని ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
మురికి బట్టలు ధరించే వారి ఇళ్లను లక్ష్మీ దేవి సందర్శించదట.
పళ్లు శుభ్రం చేసుకోని వారి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదట.
సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రించే వాళ్ల ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదట.
ఆ కుటుంబీకులు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారట.
లక్ష్మీ దేవిని మీ ఇంటికి రావాలనుకుంటే.. సోమరితనాన్ని వదిలివేయండని చాణక్యుడు చెప్పాడు.