జీర్ణవ్యవస్థలో జీర్ణాశయం, పేగులు చాలా ముఖ్యమైన భాగాలు. కొన్ని సార్లు మనకు పేగుల్లో శబ్దాలు వినిపిస్తుంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలా మందికి అంతుచిక్కని ప్రశ్న.
కడుపులో నుండి శబ్దాలు పేగుల కదలిక ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. పైపుల్లో నుంచి నీరు ప్రవహించే సమయంలో ఎలా శబ్ధం వస్తుందో అదే తరహాలో పేగుల్లో నుండి శబ్దాలు పొట్ట పై భాగానికి వినిపిస్తుంటాయి.
పేగు శబ్దాలు సాధారణమైనవి. ఇలా శబ్ధాలు వస్తున్నాయంటే జీర్ణశయాంతర పేగు పని చేస్తుందని అర్థం. స్టెతస్కోప్‌తో పొట్టలోపలి పేగుల కదలికల్లో వచ్చే శబ్దాలను వినవచ్చు.
చాలా పేగు శబ్దాలు ఎలాంటి హానిచేయనివనే చెప్పాలి. అయితే అసాధారణ శబ్దాలు సమస్యను సూచిస్తున్నట్లుగా గుర్తించాలి. పేగుల్లో ఆహారం కదలికల వల్ల కొన్ని సార్లు గ్యాస్ ఏర్పడి అది శబ్దాలుగా మారుతుంది.
ఒక మోస్తరు స్థాయిలో శబ్దాలు వస్తే ఖంగారు పడాల్సిన పనిలేదు. అది సాధారణమే. దాంతో ఎలాంటి హాని కలగదు.
కానీ అసలు శబ్దాలు రాకపోతే.. అలాంటి వారు మలబద్దకంతో బాధపడుతున్నట్లు అర్థం. లేదా ఇతర జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాంటి వారికి పేగుల నుంచి శబ్దాలు రావు.
పేగుల నుంచి శబ్దాలు మరీ ఎక్కువగా వస్తుంటే.. గ్యాస్ లేదా విరేచనాల సమస్య ఉందని తెలుసుకోవాలి. లేదా వికారం, వాంతులు అయ్యే వారికి, అవ్వబోతున్న వారికి ఇలా పేగుల నుంచి ఎక్కువగా శబ్దాలు వస్తుంటాయి.
కడుపులో నుండి శబ్దాలు పేగుల కదలిక ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. పైపుల్లో నుంచి నీరు ప్రవహించే సమయంలో ఎలా శబ్ధం వస్తుందో అదే తరహాలో పేగుల్లో నుండి శబ్దాలు పొట్ట పై భాగానికి వినిపిస్తుంటాయి.