భోజనం తరవాత మౌత్‌ఫ్రెష్‌నర్‌లా కూడా యాలకులను వాడుతుంటాం. వీటి వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా.
యాలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.
యాలకులు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రిస్తాయి.
యాలకులు తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు.
యాలకులలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
వర్షాకాలంలో దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పితో బాధపడుతుంటే యాలకులు టీ తాగడం మంచిది.
పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, కండరాల తిమ్మిరితో బాధపడే వారికి యాలకుల నీరు చాలా మేలు.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.