ఆంగ్లంలో ‘Fox nuts’ ఫూల్ మఖానా.. తెలుగులో వీటిని తామర గింజలు అంటారు
ఫూల్ మఖానా తినేవారి సంఖ్య తక్కువగానే ఉంది. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తినడం వల్ల కంటి నిండా నిద్ర వస్తుంది. ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారు రాత్రిపూట వీటిని తింటే ఫుల్ గా నిద్రలో జారిపోతారు.
ఫూల్ మఖానా తినడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వంటి పెద్ద రోగాలు దరికి చేరవు.
వీటిలో కేలరీలు,సోడియం కూడా తక్కువగా ఉంటుంది. అరటి పండు తిన్నంత బలం దీనికి వస్తుంది.
గర్భిణులకు, బాలింతలకు ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత రాకుండా కాపాడుతుంది.
ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. అయితే వీటిని నూనెలో వేయించకుండా, నేరుగా కళాయిలో వేయించుకుని తినాలి. పచ్చివి తిన్నా చర్మానికి మంచిదే.
ఇవి తింటే ఆకలి పెరుగుతుంది. అలాగని బరువు పెరుగుతారనుకోవద్దు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది.
వీటిని తింటే గుండె జబ్బులు రావు. మలబద్ధకం సమస్య కూడా రాదు. ఫూల్ మఖానాతో వండిన వంటల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ.
మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి.
ఈ తామర గింజలు తింటే శరీరంలోని వ్యర్ధాలు ఇవి బయటికి పంపిస్తాయి.