ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతోంది.  

పౌష్టికాహార లోపం, నూనె, హెయిర్ ప్రొడక్ట్స్, హెయిర్ కలర్, హెయిర్ డ్రైయర్ వాడకం వటి కారణాలు ఉన్నాయి.  

ఈ సమస్యలు చెక్ పెట్టలంటే.. ఈ టిప్స్ పాటించండి.. 

ఎండుద్రాక్ష ఇనుము యొక్క పవర్‌హౌస్. ఇది పెద్ద మొత్తంలో విటమిన్ సి ని కలిగి ఉంటుంది. జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. 

కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, బి12 పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది.    

నల్ల నువ్వులు మెలనిన్ (జుట్టు, చర్మం రంగుకు కారణమయ్యే వర్ణద్రవ్యం) ఉత్పత్తి చేయడానికి మెలనోసైట్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయి. 

 వయస్సులోనే మీ పిల్లల జుట్టు నెరిసిపోకూడదనుకుంటే, నువ్వులు తినిపించండి.  

ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది చిన్న వయసులోనే జుట్టు నెరసిపోకుండా చేస్తుంది.

మీ ఆహారంలో ఉసిరి రసాన్ని చేర్చండి. దీనిని పొడి రూపంలో కూడా ఇవ్వవచ్చు.  

 ఉసిరి నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి. మంచి ఫలితం లభిస్తుంది.