రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ కోసం ఓ మెగా ఈవెంట్ నిర్వహించగా.. అందులో బుజ్జి అనే అత్యంత విలాసవంతమైన త్రీవీలర్ కారులో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ చిత్రంలో ఈ కారు పాత్ర పేరు బుజ్జి. బుజ్జి పరిచయం అయినప్పటి నుంచి సర్వత్రా చర్చ జరుగుతోంది. 

ఈ కారును మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, జయం ఆటోమోటివ్స్ బృందం సంయుక్తంగా తయారు చేసింది.  

  Buzzi ఒక ఎలక్ట్రిక్ కారు, ఇది ఒక పెద్ద ఇంజనీర్ల బృందంచే గొప్ప ప్రయత్నంతో అభివృద్ధి చేయబడింది. 

ఈ కారు ముందు రెండు చక్రాలు, వెనుక ఒక పెద్ద చక్రాన్ని కలిగి ఉంది.  

 బుజ్జి 16 టన్నుల బరువు ఉంది.  పొడవు 6075 మిమీ, వెడల్పు 3380 మిమీ, ఎత్తు 2186 మిమీ.

 ఈ కారుకు 34.5 అంగుళాల పెద్ద చక్రాలు అమర్చారు. 

ఇది 47kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 94kW పవర్, 9800 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  

ఈ కారు ధర సుమారు రూ. 7 కోట్లుగా ఉండొచ్చు.