అధిక బరువు.. ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే.. కొన్ని ప్రయత్నాలు త్వరగా ప్రభావం చూపవు. అయితే.. ఈ బ్లాక్ ఫుడ్స్‌తో మాత్రం ఈజీగా బరువు తగ్గే ఛాన్స్ ఉంది.

షియా గింజలు: వీటిలో ఖనిజాలు, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొవ్వుని కరిగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును తగ్గిస్తాయి.

నల్ల మిరియాలు: ఇందులో విటమిన్లు ఎ, సి, కె, మినరల్స్, హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు బరువుని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లాక్ రైస్: వీటిలో ఆంథోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులోని ఫైబర్ బరువు తగ్గించడంతో పాటు టైప్-2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది.

బ్లాక్ టీ : ఇందులో ఉండే పాలీఫెనాల్స్.. సెల్ డ్యామేజ్‌ని తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. ఫలితంగా ఊబకాయం నుంచి ఉపశమనం లభిస్తుంది.

బ్లాక్ వెల్లుల్లి: వీటిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

బ్లాక్‌బెర్రీ: ఇందులో వివిధ రకాల పోషకాలున్నాయి. వీటిని తరచూ తింటే.. అందమైన చర్మంతో పాటు బరువు కూడా తగ్గుతారు.