డయాబెటిస్‌తో బాధపడుతున్న వారందరూ నోరు కట్టుకొని జీవంచాల్సి వస్తుంది.

ఏం తిన్నా కూడా ఏం జరుగుతుందోనని భయం. రక్తంలో షుగర్ పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. 

డయాబెటిస్ పెరిగిపోతే మొదట కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. అందుకే మధుమేహం ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఆహారం విషయంలో అప్రమత్తతతో ఉండాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచే సులువైన చిట్కా మెంతులు. 

మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మీరు తినే ఆహారంలో మెంతుల్ని రోజు ఉండేలా చూసుకోండి. 

రోజు పరగడుపున మెంతుల పొడిని నీటిలో కలుపుకొని, గంట పాటు నానబెట్టి వాటిని తాగితే, నెల రోజుల్లో మధుమేహం అదుపులోకి వచ్చేస్తుంది. 

రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం లేచి ఆ నీళ్లను తాగినా మంచిదే. లేదా మెంతుల పొడిని రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయం లేచి ఆ పొడి తో సహా తాగినా ఎంతో మేలు.  

ఎలా చేసిన మెంతులు పొట్టలోకి వెళ్లడం ముఖ్యం. ఇలా పరగడుపున మెంతులు పొట్టలోకి వెళ్లడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.