ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్స్ ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. 

శరీరం ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం అవసరం. ఇది ఫ్లూ, జలుబు వంటి వాటిని దూరంగా ఉంచుతుంది. 

చలికాలంలో చర్మసంరక్షణకు మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడాలి. 

ప్రతీ రోజూ శరీరానికి అవసరం అయ్యే నీటిని తీసుకోవాలి. ఇది డీహైడ్రేషన్ నుంచి రక్షణ ఇస్తుంది. 

శరీరానికి సరిపోయేంతగా నిద్ర ఉండాలి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. హర్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. 

చలి కాలంలో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఇది వైరస్, బ్యాక్టీరియాలను నిరోధిస్తుంది. 

స్మోకింగ్ మానేయాలి.. ఇది చలికాలంలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లను పెంచే అవకాశం ఉంటుంది. 

విటమిన్ డీని తీసుకోవాలి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది.