మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చాలా ముఖ్యమైన అంశం. ఎక్సర్‌సైజ్ అంటే జిమ్‌కు వెళ్లి మాత్రమే చేయాలని ఏం లేదు. ప్రతి రోజు యోగా, నడక, పరుగు లాంటివి చేస్తే కూడా ఆరోగ్యంగా ఉంటారు.
మనం రోజులో ఏ సమయంలో వ్యాయామాలు చేస్తామనే విషయం చాలా కీలకం. ముఖ్యంగా సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల మధ్య చేసే వ్యాయామాలు బాగా ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఒకరోజులో ఓ ప్రత్యేక సమయంలో చేసే వ్యాయమాలు మహిళలు, పురుషుల మధ్య కూడా వేరు వేరు ప్రభావాన్ని చూపుతాయి.
సాయంత్రంవేళ చేసే ఎక్సర్‌సైజ్‌లే గరిష్ఠ ప్రయోజనాలు కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒకవేళ మీకు ఉదయం 7గంటలకే ఎక్సర్‌సైజ్‌లు చేసే అలవాటు ఉంటే కంగారుపడాల్సిన పనిలేదు. మీరు కూడా ఇలాంటి గరిష్ఠ ప్రయోజనాలు పొందొచ్చనే సంకేతాలు కూడా ఉన్నాయి.
అయితే నిర్దిష్ట సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఈ జీవగడియారాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ మగవారికి మాత్రం సాయంత్రం వేళ చేసే వ్యాయమాలు రక్తపోటును తగ్గించి, కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి.
ఏ సమయంలో వ్యాయమాలు చేస్తే సంపూర్ణ ప్రయోజనాలు కలుగుతాయనే విషయంపై గతంలో జరిగిన అధ్యయనాల ఫలితాలు అసంపూర్ణంగానే ఉన్నాయి.
దీనికి కారణం అందరికీ ఒకేరకమైన ఫలితాలు కాకుండా, ఆయా వ్యక్తుల మధ్య భిన్నమైన ఫలితాలు రావడమే.
రోజూ ఒకే సమయంలో ఎక్సర్‌సైజులు చేయడం వల్ల మన శరీరం మెరుగ్గా మారుతుంది.
ఏ సమయంలో ఎక్సర్‌సైజులు చేసినా మంచిదే అని చాలామంది పరిశోధకులు చెబుతుంటారు. కానీ మీరో నిర్ణీత సమయాన్ని అనుకుని, తదనుగుణంగానే మీరు ఎక్సర్‌సైజులు క్రమం తప్పకుండా చేస్తే మీ శరీరం మీకు అదనపు ప్రయోజనాలు అందిస్తుంది.
మనం రోజులో ఏ సమయంలో వ్యాయామాలు చేస్తామనే విషయం చాలా కీలకం. ముఖ్యంగా సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల మధ్య చేసే వ్యాయామాలు బాగా ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.