వివాహ బంధం అనేది రెండు కుటుంబాలను కలిపే అపూర్వ అనుబంధం. 

వివాహ బంధం విచ్చిన్నం కాకుండా ఉండాలంటే ముందే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి.

గతంలో అబ్బాయికి మరేదైనా అమ్మాయితో సంబంధం ఉందా లేదా, ఉంటే ఏ మేరకు కలిగి ఉన్నాడో తెలుసుకోవాలి.  

 శృంగారం విషయంలో అతని ఆలోచన ఏమిటి అని తెలుసుకోవాలి.

పెళ్లి తర్వాత అతను జీవిత భాగస్వామి నుండి ఏం ఆశిస్తున్నాడో ముందే తెలుసుకోవాలి.

మీరు అనుకున్న ఆశయాలకు మీ జీవిత భాగస్వామి సహకరిస్తారా లేదా? అని ఆలోచించాలి. 

మీ భాగస్వామి మిమ్మల్ని ఎంత వరకు అర్ధం చేసుకుంటాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

పిల్లలను ఎప్పుడు కనాలి? ఎంతమంది? మొదలైన విషయాలను ముందే చర్చించుకోవడం మంచిది.

ఆర్థిక స్థితి గురించి చర్చించుకుంటే చాలా మంచిది.