చాలామందికి కడుపులో మంట తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనా ఏం చేసినా కడుపులో మంట తగ్గదు. ఏది తినలేక ఇబ్బందుల పాలవుతారు.
కడుపులో మంట తగ్గడం కోసం కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
సహజంగా కడుపులో మంట ఎసిడిటీ వల్ల వస్తుంది. స్పైసీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ వల్ల, విపరీతంగా యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల ఎసిడిటీ వచ్చి కడుపులో మంటగా ఉంటుంది.
ఎసిడిటీని తగ్గించడానికి రోజూ నీళ్లను ఎక్కువగా తాగే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు.
బెల్లం కూడా ఎసిడిటీని తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
తులసి ఆకులను తినడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గుతుందని చెబుతున్నారు.
బాదం పప్పులతో ఎసిడిటీ నుండి కాస్త రిలీఫ్ లభిస్తుందని సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గుతుందని, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్లు తినడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు.
అంతేకాదు కడుపులో మంటగా ఉన్నప్పుడు అరటిపండు తింటే కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
పెరుగులో రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే మంట నుండి ఉపశమనం లభిస్తుంది.
కీర దోసకాయ తినడం గాని, కీరదోస జ్యూస్‌ను త్రాగడం గాని చేస్తే కడుపులో మంట తగ్గి కాస్త కడుపు చల్లగా మారుతుందని చెబుతున్నారు.
కడుపులో మంటను సహజంగా తగ్గించడంలో అవకాడో ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.