బాదం పప్పు, బఠాణీ, పిస్తా, మరే ఇతర నట్స్ కన్నా కూడా అక్రూట్లలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
డ్రైఫ్రూట్స్ అన్నీ గుండెకు సంబంధించే వ్యాధులను తగ్గించే లిపిడ్స్‌ను మెరుగుపరుస్తాయి.
అక్రూట్లు అంతకు మించి సాయపడతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. రోజుకు ఏడు అక్రూట్ పప్పులు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీలో అధిక శాతం ఉండే పాలిఫెనాల్స్ ధ్వంసమైన డీఎన్‌ఏను మరమ్మతు చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుంది.
కొన్ని రకాల కాన్సర్లను రాకుండా నిరోధించుకోవచ్చు. అయితే, నిత్యం నాలుగు కప్పులకు మించకుండా గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం.
అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ పాప్‌కార్న్. వీటిలో ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధిక శాతంలో ఉంటాయి.
పాప్‌కార్న్‌లో ఉప్పు తగ్గించుకుంటే వీటిని మించిన ఆహారం లేదు. మైక్రోవేవ్ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటే తక్కువ ఉప్పుతో రెండు నిమిషాల్లో పాప్‌కార్న్ తయారు చేసుకోవచ్చు.
డార్క్ చాక్లెట్‌లో పాలిఫెనాల్స్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాకుండా రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.
నిత్యం ఒక చిన్న సైజ్ డార్క్ చాక్లెట్ బార్ తింటే రక్తపోటు తగ్గుతుంది. వీటిలో ఉండే కెఫైన్ మానసికంగాఉత్తేజితం చేయడమే కాకుండా ఏకాగ్రత పెంచేందుకు సహాయపడుతుంది.
ఆకలి వేస్తున్న భావనను జయించాలంటే ఉత్తమ మార్గం పండ్లు తినడం. వీటి ద్వారా లభించే పౌష్టికత మనం నీరసపడకుండా రోజంతా పని చేసేందుకు శక్తినిస్తాయి.