చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ నార్మల్‌కు వచ్చేందుకు మందులు వాడుతుంటారు.
రక్తపోటు కంట్రోల్‌లో ఉండాలంటే.. కొన్ని ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం..
చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాలను సడలించి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
సిట్రస్ పండ్లలో ఉండే పొటాషియం, శరీరంలోని అధిక సోడియంను బయటకు పంపి, రక్తనాళాలను సడలించడంలో సహాయపడతాయి.
పాలకూర, బచ్చలికూర వంటి వాటిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. బీపీని అదుపులో ఉంచుతాయి.
గింజలు ఫైబర్, అర్జినైన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. దీంతో రక్త ప్రవాహం సులభంగా జరుగుతుంది.
బెర్రీలలో ఆంథోసైనిన్లు ఉన్నాయి. ఆంథోసైనిన్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
ఆలివ్ ఆయిల్‌లో ఒలేయిక్ యాసిడ్ అధికంగా ఉంటుందని.. ఇది రక్తనాళాలను సడలించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.