రాత్రిపూట మంచి నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. మంచి నిద్ర మన శక్తి స్థాయిలు, మానసిక స్థితి, ఏకాగ్రత, ఉత్పాదకత, ఇతర విషయాలతో పాటు తినే విధానాలను కూడా ప్రభావితం చేస్తుంది.
వాస్తవానికి మీరు కంటినిండా నిద్ర పోలేకపోతే మీరు భవిష్యత్‌లో మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది.
పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.
అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిది అంటారు. వీటిని తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
బీన్స్‌లో సుఖ నిద్రకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా.. ఇందులోని బి, బి 6, బి12 అనే విటిమన్లు నిద్రలేమి సమస్యలు దూరం చేస్తాయి.
మెగ్నీషియం అధికంగా ఉండే బాదం తినడం వల్ల కూడా హాయిగా నిద్రపడుతుంది.
మెలటోనిన్ సమృద్ధిగా ఉండే చెర్రీలు నిద్రపుచ్చుతాయి. నిద్రించడానికి ముందు కొన్ని చెర్రీ పండ్లను తినడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు.
చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బఠానీల్లోనూ నిద్రకు సాయపడే ఎన్నో పోషకాలు ఉంటాయి.
కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫ్యాట్‌లెస్ పెరుగుని తీసుకోవడం వల్ల సుఖ నిద్ర మీ సొంతం అవుతుంది.
ఇనుము శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.