డార్క్ చాక్లెట్ లో కోకోతో పాటు యాంటీ ఆక్సిడెంట్ మెండుగా ఉంటుంది. కావున ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.
సాల్మోన్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
అవకాడో పండ్లలో ఆరోగ్యకర కొవ్వులతో పాటు ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి.
పుచ్చకాయలో నీరు 97శాతం వరకు ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగేద ఈనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి..
స్వీట్ పొటాటో తినడం వల్ల ముఖం యవ్వనంగా కాంతి వంతంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇందులో బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. దీని వల్ల చర్మంలో ముడతలు రాకుండా ఉంటాయి.
టమాటా లో లైకోపీన్ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది యూవీ కిరణాల జరిగే స్కిన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. టమాలా తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.
కోడిగుడ్లలో బయోటిన్ ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల జుట్టుతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ కోడి గుడ్డు తినడం వల్ల చర్మాన్ని, జట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొల్లాజెన్ ఉప్పత్తిలో సహాయపడుతుంది. అందువల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడి మిమ్మల్ని యవ్వనంగాగ ఉంచుంతుంది.