సోయా పాలలో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేందుకు సహకరిస్తుంది.

మహిళల్లో మెనోపాజ్‌ తొలినాళ్లలో ఆస్టియోపోరోసిస్‌ ఇబ్బందుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాల కారణంగా సోయా పాలు కార్డియోవాస్కులార్‌ వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది.

ప్లాస్మా లిపిడ్ స్థాయిలను మెరుగుపరచడంలో సాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ శరీరం బరువు తగ్గడానికి అనువైన పానీయం.

బీఎంఐపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటు నివారణలో సహాయపడుతుంది.

చిట్లిన జుట్టును ఆరోగ్యకరంగా తయారుచేయడంలో సోయా పాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ప్రోటీన్-రిచ్ డైట్‌తో కలిపితే జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

సోయా మిల్క్ హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

చనిపోయిన చర్మ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.