ఎవరైనా నిద్రపోవడానికి సరైన పడక ఏర్పాట్లు ఉంటే చక్కగా నిద్రపోవచ్చు. అయితే మరో ముఖ్యమైన విషయమేంటంటే మనం ఉపయోగించే దుప్పటి రకం కూడా చూసుకోవాలట.

నిద్ర పోయేటప్పుడు బరువున్న దుప్పటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

బరువున్న దుప్పటి వాడడం వల్ల బాగా నిద్రపోవడంతో పాటు, మనకు కొన్ని ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

బరువున్న దుప్పటిని ఉపయోగించడం వల్ల నిద్రిస్తున్నప్పుడు అనవసరమైన టెన్షన్‌ను తగ్గిస్తుంది. దాదాపు 275 మిలియన్లకు పైగా ప్రజలు అధిక ఆందోళనతో బాధపడుతున్నారట. 

 బరువున్న దుప్పటితో నిద్రిస్తే మన నాడీ వ్యవస్థకు ఉపశమనం కలుగుతుందట. ప్రశాంతంగా నిద్రించడానికి వీలు కలుగుతుంది. 

ఈ దుప్పటి వల్ల కలిగే మితమైన ఒత్తిడి ఆక్సిటోసిన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది మన మానసిక స్థితిని సంతోషంగా ఉంచడంలో సహాయపడే హార్మోన్.

 బరువున్న దుప్పట్లతో నిద్రపోవడం అనేది హృదయ స్పందన రేటును నియంత్రించడంలో, గాఢమైన నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

నాడీ వ్యవస్థలోని కొన్ని సమస్యలు బరువైన దుప్పట్లను ఉపయోగించడం ద్వారా తొలగిపోతాయి.  

నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులు, తలనొప్పి , వెన్నునొప్పితో బాధపడేవారిలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

 ఇటీవలి అధ్యయనాల్లో అల్జీమర్స్ ఉన్న వ్యక్తులు బరువున్న దుప్పటిని ఉపయోగించి నిద్రిస్తున్నప్పుడు జ్ఞానపరమైన బలహీనత , భ్రాంతులు వంటి రాత్రిపూట సమస్యల నుండి ఉపశమనం పొందినట్లు నివేదించారు.

 మూర్ఛ ప్రభావాన్ని తగ్గిస్తుంది.  మూర్ఛలతో బాధపడేవారికి భారీ బరువు గల దుప్పట్లు మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. 

కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లు గుండె సమస్యలు, అధిక శరీర బరువు, అధిక రక్తపోటు వంటి ప్రధాన సమస్యలకు కారణమవుతాయి. భారీ దుప్పటి కార్టిసాల్‌ స్రావాన్ని అణిచివేస్తుంది. 

నొప్పి నుండి ఉపశమనం, మానసిక రుగ్మతలను సరిదిద్దడమే కాకుండా, ఇది మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.