ఉదయం నిద్రలేచిన తరువాత వాటర్ తాగడం చాలామందికి అలవాటు. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
అయితే రోజూ పొద్దున్నే ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగితే బాడీ మొత్తం డిటాక్సిఫై అవుతుంది.
పుసుపులోని సమ్మేళనాలు, ఔషధ గుణాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
గుండె ఆరోగ్యం పసుపు నీరు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.
పసుపునీరులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
పసుపులో ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లుతాగితే శరీరంలోని మలినాలు బయటకుపోతాయి. శరీరం హైడ్రేట్‌గా మారుతుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
పసుపులోని కర్కుమిన్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీర కణాలను రక్షిస్తుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
పసుపులో ఉండే సమ్మేళనాలు, ఔషధ గుణాలు మెటబాలిజాన్ని యాక్టివేట్ చేస్తాయి. అధిక బరువు బాధ తగ్గుతుంది.
టర్మరిక్ వాటర్‌లోని కర్కుమిన్ అనే సమ్మేళనం, రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.