పిస్తాపప్పును సరిపడా వేయించి..
ఉప్పు చల్లి సాయంత్రం స్నాక్ గా తీసుకుంటే ఆ రుచే వేరు.
పిస్తా పప్పులో విటమిన్ బీకీ అధికం. ఇది హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది.
ఊపిరితిత్తుల నుంచి ఇతర అవయవాలకు సరిపడా ప్రాణవాయువుని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ బి6 రోగనిరోధకశక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లకు దూరంగా, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
ఎదిగే పిల్లలకు చాలా మేలు చేస్తుంది. గుప్పెడు పిస్తా తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ 'ఇ' అందుతుంది.
ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అతినీలలోహిత కిరణాల వారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముడతలను దూరం చేస్తుంది.
పిస్తాలోని ఇతర పోషకాలు చర్మ క్యాన్సర్లు. దరిచేరకుండా కాపాడతాయి.
కంటి సమస్యలతో బాధపడే వారు వీటిని తీసుకుంటే మంచిది. కంటిచూపునకు పిస్తా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కెరొటినాయిడ్లూ, లూటిన్ అధికంగా లభిస్తాయి.
వీటిల్లో పీచు సమృద్ధిగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ పప్పు తినడానికి ప్రాధాన్యమిస్తే మంచిది.
జీర్ణవ్యవస్థ పనితీరునీ ఇది మెరుగుపరుస్తుంది.