బంతిపువ్వులో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు సంరక్షణకు ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు బంతిపువ్వును ఉపయోగించొచ్చు. 

బంతి పువ్వులు సహజ నూనెలు, పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా జుట్టు సంరక్షణ కోసం, చర్మ సంరక్షణ కోసం ప్రయోజనాలను కలిగిస్తాయి. 

బంతి ఆకులను హెయిర్ మాస్క్‌లుగా తయారు చేసుకోవచ్చు. బంతిపూల నుండి తీసిన నూనెను జుట్టు పెరుగుదలకు ఉపయోగించవచ్చు.

అనేక హెయిర్ ఆయిల్‌ల కంటే కూడా బంతిపువ్వు ఆయిల్ మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. 

ఆలివ్‌ ఆయిల్‌, కొబ్బరి నూనె, బాదం నూనెలో బంతి పువ్వు రెమ్మలు వేసి 10-15 నిమిషాలు వేడి చేస్తే ఆయిల్ రెడీ అవుతుంది. 

 ఇది జుట్టు రాలడం ఆపి వెంట్రుకలు పెరుగుదలకు, రాలిపోయిన వెంట్రుకలు తిరిగి పెరగటానికి రెండింటికీ అవసరమయ్యే కొన్ని ప్రోటీన్లను కలిగి ఉంటుంది. 

వారానికి రెండుసార్లు ఈ నూనెను మీ తలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. 

 మీరు రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకుంటారో అదే తరహాలో బంతిపువ్వులతో మేరీగోల్డ్ వాటర్ తయారు చేయవచ్చు. ఇది మీ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.