భోజనం చేసిన తర్వాత చాలా మందికి సోంపు గింజలు తినడం అలవాటు. 

మరికొందరు ఉదయం పూట ఖాళీ కడుపుతో సోంపు నానబెట్టిన నీటిని తాగుతుంటారు. 

జీర్ణ ఆరోగ్యానికి కూడా సోంపు చాలా మేలు చేస్తుంది.

ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు సోంపు ఉపశమనం కలిగిస్తుంది.

సోంపు గింజల్లో సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. 

సోంపు నానబెట్టిన నీరు లేదా టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఊబకాయం నుంచి బయటపడవచ్చు.

ఉదయాన్నే సోపు నానబెట్టిన నీరు లేదా టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి.