మనం ఎక్కువగా తీసుకొనే పండ్లలో ఫైనాఫిల్ కూడా ఒకటి..
ఈ పండు గుచ్చుకున్నట్లు ఉన్నా కూడా దీన్ని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి..
పుల్ల పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. అందుకే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
పైనాపిల్‌లో మేంగనీస్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు పటిష్టంగా తయారు అవుతాయి.
ప్రతీ రోజు ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల దంతాలు పటిష్టం అవడంతో పాటు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పైనాపిల్‌లో బీటీకెరోటిన్ కంటి చూపు నెమ్మదించడాన్ని అడ్డుకుంటుంది.
ఇందులో పీచు అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీస్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి మంచిది.
పైనాపిల్ తరుచుగా తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. జుట్టు, గోళ్లు, చర్మానికి నరిష్మెంట్ అందిస్తుంది.