ప్రతి ఇంట్లో పోపు పెట్టెలో మెంతులు తప్పకుండా ఉంటాయి. రోజూ మన ఆహారంలో ఏదో ఓ రూపంలో వాటిని వాడుతుంటాం.   

 ఇవి వంటకాల రుచిని పెంచటానికే కాదు. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లావిన్‌, కాపర్‌, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌తో పాటు విటమిన్‌ ఎ, బి6, సి, కె వంటి పోషాకలు పుష్కలంగా ఉన్నాయి. 

మెంతులలోని ఔషద గుణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. డయాబెటిస్‌, పీరియడ్‌ క్రాంప్స్‌, అధిక బరువు వంటి సమస్యలను దూరం చేస్తాయి

వీటిని నానబెట్టి తీసుకుంటే.. గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు దూరమవుతాయి.  

 మెంతులు రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రించడంలో సహాయపడతాయి. 

 వీటిలో 30-40 % ఎక్కువ పోషక గుణాలు ఉంటాయి. మెంతులు జీర్ణక్రియను, పిండి పదార్థాలను గ్రహించుకోవటాన్ని నెమ్మదిచేస్తుంది.

 మెంతులు నానబెట్టి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.  

 మెంతి గింజలు ప్రకృతిలో వేడిగా ఉంటాయి. కఫం ఎక్కువగా ఉన్నవారు మెంతి గింజలను పొడిగా, నానబెట్టి, మొలకెత్తిన ఏ రూపంలో తీసుకున్న మంచిది. 

దగ్గును తగ్గించడంలో మెంతులు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆస్తమా, దగ్గు, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, కఫవ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి.