బ్రెడ్ కోసం వినియోగించే మైదా పిండి ప్రాసెస్ చేసినది. అంతేగాకుండా బ్రెడ్ తయారీ ప్రక్రియలోనూ ప్రాసెసింగ్ జరుగుతుందని.. దాంతో అందులోని ఫైబర్ పోతుందని నిపుణులు చెబుతున్నారు.

అదే చపాతీలలో పూర్తి స్థాయి గోధుమ పిండిని ఉపయోగించడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఎక్కువ ఫైబర్ ఉన్న చపాతీతో జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.

బ్రెడ్ ను తయారుచేసేటప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కొన్ని రసాయనాలు కలుపుతారు.

చపాతీ కోసం గోధుమ పిండిలో రసాయనాలు ఏమీ కలపరని, ఈ లెక్కన చపాతీలు ఆర్గానిక్ అన్నట్టు భావించొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చపాతీలను ఒక్క గోధుమ పిండితో మాత్రమేగాకుండా జొన్నలు, సజ్జలు, ఇతర తృణ ధాన్యాలతో కూడా చేసుకుంటారు. అలాంటి వాటితో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.

బ్రెడ్ పొంగడానికి ఈస్ట్ ను కలుపుతారు. దీనివల్ల అటు ప్రయోజనాలు, ఇటు నష్టాలు రెండూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈస్ట్ మన జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు తోడ్పడుతుందని.. అయితే శరీరంలోంచి నీటిని తొలగించేందుకూ కారణమవుతుందని పేర్కొంటున్నారు.

పోషకాల పరంగా చూస్తే.. బ్రెడ్ కంటే చపాతీ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహంతో బాధపడేవారికి చపాతీలు మంచిదని.. బ్రెడ్ తో శరీరంలో వేగంగా గ్లూకోజ్ విడుదల అవుతుందని వివరిస్తున్నారు.