తియ్యగా ఉండే నల్ల ద్రాక్ష వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
నల్లటి ద్రాక్షలో సీ-విటమిన్, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి.
గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. అవి అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.
దీన్ని రోజూ తినడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.
ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి.
ఇందులో ఉండే నైట్రిన్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి. గుండెపోటు నివారణకు దోహదపడుతాయి.
నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.
ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి.
నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు.
నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా నల్ల ద్రాక్ష పండ్లను తినాలి.