మద్యం సేవించే ముందు చాలామంది గ్లాసులో వేలు ముంచి రెండు నుంచి మూడు చుక్కలు గాల్లోకి చిమ్ముతారు. లేదంటే మూడు నుంచి నాలుగు చుక్కలు నేలపై పోస్తారు. ఎప్పటినుంచో వస్తున్న ఆచారమని చెబుతారు.

మరికొందరేమో దిష్టి తగలకుండా ఉండాలని అలా నేలపై వేస్తున్నట్లు చెబుతారు. గతంలో మందు తాగే అలవాటు ఉన్నవారు ఇంట్లో తయారు చేసుకున్న మందు తాగేవారు. దీన్ని రూడీ మార్క అంటారు.

ఆల్కహాల్ స్థాయిని చెక్ చేయడానికి గ్లాసులోని మందులోనుంచి రెండు చుక్కలు నేలపై వేస్తారు. 

మట్టి బుడగలు ఏర్పడితే ఆ మందు స్ట్రాంగ్ గా ఉన్నట్లు అర్థం. అలా కాకుండా బుడగలు తగ్గితే ఆ మందు పెద్దగా కిక్ ఇవ్వదని నిర్ణయించుకునేవారు. 

గ్రామీణ ప్రజలు ఇలా చెక్ చేసుకునేవారు. పూర్వకాలంలో మహారాజులు, రాజులు ఎవరి ఇంటికి వెళ్లినా తినేవారు కాదని, తాగేవారు కాదని, ఏదైనా విష ప్రయోగం జరుగుతుందనే ప్రమాదంతో ఇలా చేసేవారు. 

తమ వేళ్లకు ఉంగాలను ధరించేవారు. అవి వివిధ లోహాలతో తయారుచేసినవై ఉండేవి. బంగారం-వెండి, నీలమణితో పాటు మరెన్నో లోహాలతో తయారుచేసినవి చేతి వేళ్లకు ఉండేవి. 

మద్యంలో వేలును ముంచి కళ్లలోని రత్నాలపై ఒక చుక్క లేదా రెండు ఆల్కహాల్ వేసి రసాయనిక చర్య జరగకుండా చూస్తారు.

మందు తాగే ముందు మూడు నుంచి నాలుగు చుక్కలు నేలపై పోయడానికి ప్రధాన కారణం ఇదేనని భావిస్తారు. 

బాగా నిద్ర పోవడానికి, ప్రశాంతతకు, ప్రయాణ ఒత్తిడిని దూరం చేసేందుకు ఉపశమనం కోసం మందు సేవిస్తారు.

ప్రయాణాలవల్ల వచ్చే బడలిక లాంటి ప్రభావాలను తగ్గించడానికి మద్యం మంచి ప్రయోజనకరమైన ఔషధంగా అప్పట్లో భావించేవారు.

ప్రయాణికులతోపాటు క్రీడాకారులుకూడా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా మద్యం సేవిస్తారు. అలా తీసుకోకపోతే వారు తమ పనిని కొనసాగించలేరు.