బెడ్‌రూంలో దంపతుల మధ్య వాతావరణం సరిగ్గా లేకపోతే ఎడబాటు వస్తుంది

బెడ్‌రూంలో వాస్తు అనేది ఇంటికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది

ఇంటి పెద్ద బెడ్‌రూం అనేది ఎప్పుడూ నైరుతిలోనే ఉండాలి. నైరుతిలో బెడ్‌రూం ఉంటే.. స్థిరత్వం, బలం చేకూరుతుంది.

ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంటే దంపతులకు నిద్రలేమి అంటే ఇన్‌సోమ్నియా వచ్చే అవకాశముంది.

బెడ్‌రూం అనేది ఇంటి మధ్య భాగంలో ఉండకూడదు. ఎందుకంటే ఇంట్లోని మధ్యభాగం అనేది బ్రహ్మస్థానంగా పిలవబడుతుంది.

పడక గదిలో బెడ్‌ను ఉత్తమ దిశలో అంటే నైరుతి వైపు ఉంచాలి.

బెడ్‌రూంలో తప్పనిసరిగా దక్షిణం లేదా తూర్పు వైపు తల పెట్టి నిద్రించాలి.

మీరు పడుకునే బెడ్ చెక్కతో తయారుచేయబడిందై ఉండాలి.  లోహంతో తయారుచేసిన మంచం వాడితే ప్రతికూల ప్రకంపనలను సృష్టిస్తుంది.

వాస్తు ప్రకారం భార్య ఎల్లప్పుడూ తన భర్తకు ఎడమ వైపున నిద్రించాలి.. బెడ్‌పై కేవలం రెండు లేదా మూడు దిండ్లు మాత్రమే ఉంచాలి.

బెడ్‌రూం ఎప్పుడూ నీట్‌గా ఉంచుకోవాలి. అలా కాకుండా చిందరవందరగా లేదా గజిబిజిగా ఉంటే అది దంపతుల మధ్య ప్రతికూలతను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.