లేడీ బాస్‌ విజయ శాంతి ఎన్నో సినిమాల్లో పోలీస్‌ గెటప్‌తో అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. 

రాశీ ఖన్నా 'సుప్రీమ్' సినిమాలో గ్లామర్‌ రోల్‌తో పాటు పోలీస్‌ గెటప్‌లో కనిపించింది. 

అమలాపాల్‌.. విజయ్ నటించిన 'అన్న' అనే చిత్రంలో తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. 

కాజల్ అగర్వాల్‌.. తలపతి విజయ్‌ చిత్రం 'జిల్లా' మూవీలో పోలీస్ గెటప్‌లో కుర్రకారును ఆకట్టుకుంది. ఇటీవల సత్యభామ సినిమాలో ఏసీపీ పాత్ర పోషించింది. 

చాందినీ చౌదరి.. ఇటీవల వచ్చిన యేవమ్ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించింది. 

పాయల్‌ రాజ్‌పుత్‌.. తాజాగా వచ్చిన రక్షణ చిత్రంలో పోలీస్‌ గెటప్‌లో అలరించింది. 

నందిత శ్వేత.. హిడింబ చిత్రంలో పోలీస్‌ అధికారిగా కనిపించింది. 

కీర్తి సురేష్.. జయం రవి నటించిన 'సైరన్‌' చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించింది.

రష్మిక మందన్నా.. నాగార్జున, నాని హీరోలుగా నటించిన 'దేవదాస్‌'  సినిమాలో పోలీస్‌ అధికారిగా అదరగొట్టింది. 

త్రిష.. 'బృందా' అనే వెబ్‌సిరీస్‌లో ఎస్సైగా నటించి.. కేసులను పరిష్కరించింది.