ఇటీవల విడుదలైన 'కస్టడీ' చిత్రంలో సీఎంగా అదరగొట్టే ఫర్ఫార్మెన్స్ చేసింది అందాల నటి ప్రియమణి.
ధర్మయోగిలో రాజకీయంగా ఎదిగేందుకు ఏదైనా చేసే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది నటి త్రిష.
గాఢ్ ఫాదర్‌లో ముఖ్యమంత్రి కూతురిగా.. హీరో చిరంజీవికి సోదరిగా.. చివరికి తన తండ్రి పార్టీ పగ్గాలు స్వీకరించి ముఖ్యమంత్రి అవుతుంది లేడీ సూపర్ స్టార్ నయనతార.
సరైనడు చిత్రంలో ఎమ్మెల్యేగా నటించింది కేథరిన్.
బంగార్రాజులో సర్పంచ్ అవ్వాలని పరితపించే అమ్మాయిగా కృతిశెట్టి నటించింది.
తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ క్వీన్ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ట టైటిల్ పాత్ర పోషించింది. రిపబ్లిక్ చిత్రంలోనూ రాజకీయ నాయకురాలిగా నటించింది.
తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవీలో టైటిల్ రోల్, ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ పాత్ర పోషించింది క్వీన్ కంగనా రనౌత్.
కేజీఎఫ్‌లో రవీనా టాండన్ ప్రధాని రమికా సేన్ పాత్రను పోషించింది.
రాజ్‌నీతి చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నటించింది బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్.
మహారాణి వెబ్ సిరీస్‌లో హ్యూమా ఖురేషి రాజకీయ నాయకురాలిగా కనిపించింది.