పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ.

 ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. 

 మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ.. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 

రెండోరోజు అటుకుల బతుకమ్మ.. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు.

నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ.. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు.

ఐదోరోజు అట్ల బతుకమ్మ.. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరోరోజు అలిగిన బతుకమ్మ.. బతుకమ్మను పూలతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు.

ఏడోరోజు వేపకాయల బతుకమ్మ..  బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు.

ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ.. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు.

 నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది..  పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు.