సీతాకాలంలో సీజన్ వ్యాధులు వస్తాయి కాబట్టి.. ఆహారాలు తీసుకునే విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. అప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే.

పెరుగును వీలైనంత వరకు దూరం పెట్టాలి. లేకపోతే.. ఊపిరితిత్తుల వ్యాధి రావచ్చు. ఇది దగ్గు, జలుబు, తలనొప్పికి కారణమవుతుంది.

పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేస్తాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే.. అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది.

సలాడ్లు, పచ్చి కూరగాయలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ప్రభావం చూపి.. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలొస్తాయి.

ఐస్ జ్యూస్, సాఫ్ట్ డ్రింక్స్‌కి చాలా దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, మధుమేహానికి దారి తీస్తుంది.

స్వీట్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి, చలికాలంలో స్వీట్ స్నాక్స్‌ను దూరంగా ఉంటేనే చాలా బెటర్. 

రెడ్ మీట్ తినడానికి  రుచిగా ఉంటుంది కదా అని లాగిస్తే.. గుండెకు, ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, వాటిని తినకూడదు.