మారుతున్న కాలంలో రోజు రోజుకు ఇయర్ ఫోన్స్ వాడకం పెరిగిపోతుంది. ఆఫీసుకు వెళ్లినా, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, చివరకు ఇంట్లో ఉన్నా చెవిలో ఇయర్ ఫోన్స్ మస్ట్‌గా మారింది.
కొంత మంది గంటల కొద్దీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడటం, పాటలు వినడం చేస్తారు. ఇలా చేయడం అస్సలే మంచిదికాదని హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల చిరాకు, తలనొప్పి తల తిరగడమే కాకుండా చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.మారుతున్న కాలంలో రోజు రోజుకు ఇయర్ ఫోన్స్ వాడకం పెరిగిపోతుంది.
ఆఫీసుకు వెళ్లినా, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, చివరకు ఇంట్లో ఉన్నా చెవిలో ఇయర్ ఫోన్స్ మస్ట్‌గా మారింది. అయితే ఇయర్ ఫోన్స్ అతిగా వాడితే వినికిడి సామర్థ్యం పూర్తిగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
దీనివల్ల చిరాకు, తలనొప్పి తల తిరగడమే కాకుండా చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.60 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం డైరెక్ట్‌గా వినడం ఎవరికైనా మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
70 నుంచి 80 డెసిబిల్స్ మధ్య సౌండ్ కంటిన్యూగా వినడం వల్ల త్వరగా చెవుడు వచ్చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెలలో 20 సార్లు 20 నిమిషాల పాటు 90 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే వినికిడి లోపం తప్పదని కొన్ని కేర్ స్టడీస్ కూడా చెబుతున్నాయి.
ఇయర్ ఫోన్ల నుంచి వచ్చే శబ్దం కర్ణభేరికి దగ్గరగా ఉంటుంది. ఈ శబ్దం ఎక్కువ అయినప్పుడు కర్ణభేరికి శాశ్వత నష్టం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
వాడకం తప్పదు అనుకున్నప్పుడు ఎయిర్ బర్డ్స్ రెండూ ఒకేసారి కాకుండా ఒక చెవిలో కొద్దిసేపు మరొక చెవిలో మరి కొంత సమయం వాడినట్టయితే కొంత ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని సూచనలిస్తున్నారు.
ఇయర్ బడ్స్ కంటే కూడా హెడ్‌ఫోన్లు పెట్టుకుంటే.. శబ్ధానికి, కర్ణభేరి మధ్య గ్యాప్ ఉంటుంది. దానివల్ల చెవిపై అంతగా ప్రభావం ఉండదని.. అవి కూడా అధికంగా వాడడం మంచిది కాదు అని సూచిస్తున్నారు వైద్యులు.
చెవి నొప్పి, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే ఇయర్ ఫోన్స్ వాడటం వెంటనే ఆపేయాలని వైద్యులు అంటున్నారు.