అవకాడో ఒక పోషకాలు సమృద్ధిగా ఉన్న సూపర్‌ఫుడ్‌. ఇది గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, చర్మ కాంతి, బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవకాడోను నేరుగా తినవచ్చు, సలాడ్‌లలో, సాండ్విచ్‌లో, స్మూతీలలో లేదా గ్వాకమోలే వంటి డిప్‌లలో వాడుకోవచ్చు.

అవకాడోలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

అవకాడో తినడం వల్ల విటమిన్ E అందుతుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది.

అవకాడోలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుంది.

ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది, శిశువు మెదడు, నరాల వికాసానికి సహాయపడుతుంది.

పాలతో కలిపి తాగితే పిల్లలకు, పెద్దలకు శక్తినిస్తుంది.

విటమిన్‌లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల బలాన్ని ఇస్తుంది.

మెమరీ పవర్ పెంచడంలో, మెదడు ఆరోగ్యానికి అవకాడో ఉపయోగపడుతుంది

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.