కొందరు పిల్లలు చాలా బక్కగా ఉంటారు. వీరు బలంగా తయారు కావాలంటే ఇవి తినిపించండి.. 

ఎగ్: గుడ్డులో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని రెగ్యులేట్ చేయడంలో ఎగ్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి.  

చికెన్: పిల్లలకి చికెన్ హై క్యాలరీ, హై ప్రొటీన్ ఫుడ్ అవుతుంది. చికెన్‌లో ఉండే ఫాస్ఫరస్ వల్ల ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

  సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ12, సెలీనియం, కోలిన్ ఉన్నాయి. ఇవి బ్రెయిన్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తాయి.

బెల్లం:  మీ పిల్లలకి ఇంకొన్ని హెల్దీ క్యాలరీలు అందాలంటే వారికి నచ్చిన ఫుడ్స్ లో ఆర్గానిక్ బెల్లన్ని కలపండి. 

  తేనెలో 17% నీరు, 82% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. తేనె హెల్దీగా బరువు పెరగడానికి హెల్ప్ చేస్తుంది.  

పాలు ప్రొటీన్‌కి మంచి సోర్స్. మీ పిల్లలు లాక్టోజ్ ఇంటాలరెంట్ కాకపోతే వారికి రోజూ ఒక గ్లాసు పాలు ఇవ్వవచ్చు.  

  పెరుగులో ఉండే గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అరుగుదల సరిగ్గా ఉండేలా చూస్తుంది.  

  జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, యాప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ పిల్లలకి పెట్టవచ్చు. ఇవి బరువు పెరగడానికి అవసరమవుతాయి. 

 బీన్స్, పప్పుల్లో ప్రొటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. బీన్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎక్కువే.