సాధారణంగా కొబ్బరినీళ్లు, జ్యూస్‌లు తాగడానికి ప్లాస్టిక్‌ స్ట్రాస్‌ని ఉపయోగిస్తారు.

ఈ రోజుల్లో పేపర్ స్ట్రాస్ కూడా వాడుకలో ఉన్నాయి.

చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా నిత్యం మంచినీళ్లు తాగుతాం.

కానీ మీరు తరుచూ ప్లాస్టిక్ స్ట్రాను ఉపయోగిస్తే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ప్లాస్టిక్ పదార్థాలు చాలా హానికరమైన రసాయనాల సహాయంతో తయారవుతాయి.

ఈ పదార్థాలకు వేడి, చల్లటివి తాకినప్పుడు, దాని రసాయనాలు బయటకు రావడం ప్రారంభిస్తాయి.

దీంతో ఈ రసాయనాలు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనది.

ఇది హార్మోన్ స్థాయిలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

హానికరమైన సమ్మేళనాలు మన దంతాలు మరియు ఎనామిల్‌తో సంబంధంలోకి వస్తాయి.

ఇది దంతాలలో కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇలాంటి స్ట్రాల వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.

వీటితో పెదవులకు నష్టం వాటిల్లుతుంది.