చాలామంది ఉదయం పరగడుపున నిమ్మరసం తేనే తాగుతూ ఉంటారు. అయితే నిమ్మరసం తేనె పరగడుపున తాగడం మంచిదేనా?

 అయితే ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని పలువురు ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున కాస్త గోరువెచ్చని నీళ్లను తాగాలని ఆ తర్వాత నిమ్మరసం తేనే తాగొచ్చని చెబుతున్నారు. 

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల మన పొట్టలో యాసిడ్ పరిమాణం పెరుగుతుందని నిమ్మకాయలో ఉండే ఆమ్లా లక్షణాలు మన జీర్ణ వ్యవస్థపైన ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎముకల సమస్యలు, దంత సమస్యలు, డిహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 

 అంతేకాకుండా.. తరచూ మూత్ర విసర్జన వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పళ్ళు తోముకుని మొదట రెండు గ్లాసుల నీళ్లు తాగాలాని చెప్తున్నారు.

ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. 

ఇక నిమ్మరసం తేనే తాగేవారు ప్రతిరోజు ఇదే విధానాన్ని అనుసరిస్తే మంచిదని శరీరంలో మెటబాలిజం పెరిగి అదనపు కొవ్వును కరిగించడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఇలా తాగినప్పుడు ఇది మన బరువును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుందని సూచిస్తున్నారు. 

మన రోగనిరోధక శక్తి బలోపేతం కావడానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడానికి ప్రతి రోజు నిమ్మరసం తేనే తీసుకునేవారు ఖాళీ కడుపుతో నిమ్మరసంతో, తేనె తాగకుండా మొదట కొంత నీళ్లు తాగిన తర్వాత నిమ్మరసం తేనే తాగితే మంచిదని చెబుతున్నారు. 

ఇక ఈ చిన్న టిప్ ను పాటిస్తే మనకు జీర్ణ సంబంధమైన ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్తున్నారు.