చలి పెరుగుతోంది. హీట్‌ వాటర్‌తో స్నానం చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. హీటర్స్, గ్రీజర్స్‌ కొనే ముందు చూడాల్సినవి.. 

  ఏ వాటర్ హీటరైనా.. తక్కువ ధర ఉండాలి. మంచి బ్రాండ్ అయి ఉండాలి. కరెంటు తక్కువ కాల్చాలి. 

మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. త్వరగా వాటర్ హీట్ అవ్వాలి. ఇవన్నీ మనం పరిశీలిస్తాం. వీటితో పాటు టెక్నికల్‌గా మరికొన్ని విషయాలు గమనించాలి.

 వాటర్ హీటర్లలో 3 రకాలున్నాయి. స్టోరేజ్ వాటర్ హీటర్ అనేది.. మీడియం, పెద్ద ఫ్యామిలీలకు బాగుంటుంది. ఇవి వేడి నీటిని స్టోర్ చేస్తాయి.

 అదే ఇన్‌స్టాంట్ వాటర్ హీటరైతే వెంటనే నీటిని వేడి చేస్తాయి. ఇవి చిన్న ఫ్యామిలీస్‌కి బాగుంటాయి. సోలార్ వాటర్ హీటరైతే ఎండ ఎక్కువగా ఉండే చోట బాగుంటుంది.  

హీట్ ఎలిమెంట్చాలా వాటర్ హీటర్ల హీటింగ్ ఎలిమెంట్, కాపర్ హీటింగ్ ఉంటుంది. ఇది ఎక్కువగా వాడే వారికి బాగా ఉపయోగపడుతుంది. 

  ఏ వాటర్ హీటర్ కొన్నా.. దానికి ఎనర్జీ రేటింగ్ ఎంత ఉందో తప్పక చూడాలి. ఎనర్జీ రేటింగ్ 3-5 ఉంటే.. కరెంటు తక్కువ కాలుతుంది. 

 సైజ్ తప్పక చూడాలి. 2-3 సభ్యులు ఉండే కుటుంబానికి10-15 లీటర్ల వాటర్ హీటర్ సరిపోతుంది. 4-6 మంది ఉంటే 20-25 లీటర్స్ బెటర్.

 ఇన్‌స్టాంట్ వాటర్ హీటర్లు వెంటనే 1-3 లీటర్ల వరకూ వేడి చేస్తాయి. అందువల్ల కుటుంబ సభ్యులు సంఖ్యను బట్టీ వాటర్ హీటర్‌ని ఎంచుకోవాలి. 

 వాటేజ్ రేంజ్.. 1500W నుంచి 3000W వరకూ ఉండేలా చూసుకుంటే మేలు.  

 హీటర్ కొనేటప్పుడు.. సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడాలి. వాటర్ హీటెక్కాక ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలాంటివి కొనుక్కోవాలి. 

  బాత్రూమ్‌లో ఇన్‌స్టాలేషన్ కోసం ఎక్కువ స్పేస్ ఉందో లేదో చూసుకోవాలి. నిలువుగా లేదా అడ్డంగా ఉన్నవి ఎంచుకోవచ్చు.