కాలిన గాయం అయినప్పుడు చాలా మంది వెంటనే టూత్ పేస్టు రాస్తుంటారు. దీని వల్ల కలిగే నష్టాలు ఎంటో చూద్దాం..
టూత్‌పేస్ట్‌లో ఉండే గ్లిసరాల్ ఒక నాన్-టాక్సిక్ పదార్థం, దీన్ని స్వీటెనర్, ఫుడ్ ప్రిజర్వేటివ్‌గా ఉపయోగిస్తారు.
ఇది టూత్‌పేస్ట్ ఎండిపోకుండా కాపాడుతుంది. కనుక దీన్ని గాయంపై రాస్తే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది.
టూత్‌పేస్ట్ చర్మాన్ని పొడి చేయడమే కాకుండా, దానిపై మందమైన పొరను సృష్టించి, సరైన హైడ్రేషన్ అందకుండా చేస్తుంది.
టూత్‌పేస్ట్‌లో ఉండే కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. దీనివల్ల కాలిన చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
టూత్‌పేస్ట్‌లో ఉండే సోడియం ఫ్లోరైడ్ ప్రధానంగా దంతక్షయం రాకుండా కాపాడుతుంది.
కానీ సోడియం ఫ్లోరైడ్ కళ్ళు, చర్మం, శ్లేష్మ పొరలకు తగిలితే మంటను కలిగిస్తుంది.