గొంతు వాపు, నొప్పి ఉన్న వారు.. ఎండిన అంజీర పండ్లను ఉడకబెట్టి, బాగా రుబ్బి, ఆ మిశ్రమాన్ని గొంతు దగ్గర పెట్టాలి. త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఎండిన అంజీర పండ్లను, రాత్రి వేడి పాలలో వేసి ఉడకబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమం తాగితే.. మలబద్దకం సమస్య తీరుతుంది.

తాజా అంజీర పండ్లను తిన్నాక ఒక గ్లాసు పాలు తాగితే.. శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు సంతాన లోపం, స్త్రీలలో అండోత్పత్తి సమస్యలు దూరమవుతాయి.

ఎండు అంజీర పండ్లను పాలు, చక్కెరతో కలిపి ఒక వారం పాటు తీసుకుంటే.. రక్త రుగ్మతలు తగ్గుతాయి.

క్షయవ్యాధి నివారణ, టిబి ప్రభావం తగ్గడానికి తాజా అంజీర పండ్లు చాలా ఉపయోగపడుతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు చక్కటి ఔషధంగా పని చేస్తాయి.

అంజీర్‌లో ఉండే ఫైబర్, విటమిన్‌ ఈ, ఫ్యాటీ యాసిడ్లు.. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

అంజీర్ పండ్లను తరచూ తింటే.. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె స‌మ‌స్యలు దరిచేరవు.

అంజీర్ పండ్లను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల కోల‌న్‌, బ్రెస్ట్‌, స‌ర్విక‌ల్‌, లివ‌ర్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి