న్యూస్ ప్రెజెంటర్గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారింది తెలుగు అమ్మాయి అనసూయ భరద్వాజ్.

ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే అనసూయ భరద్వాజ్ తెలుగు వారందరికీ బాగా దగ్గర అయిపోయింది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఆమె ప్రతి తెలుగింటికి చేరిపోయింది.

నిజానికి అనసూయ భరద్వాజ్ యాంకర్ కాకముందే సొంతం అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా నటించింది.

యాంకర్ గా మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఆమెకు నటిగా పలు అవకాశాలు వచ్చాయి ఆ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ఆమె ముందుకు దూసుకుపోతోంది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించిన ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత అనసూయ భరద్వాజ్ పలు ఇతర సినిమాలలో కూడా నటించింది కానీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు.

మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగంలో దాక్షాయిని అనే పాత్రలో మెరిసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన పెద్దకాపు అనే సినిమాలో కూడా అనసూయ ఒక కీలక పాత్రలో నటించింది.

తాజాగా జరిగిన పెద్దకాపు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అనసూయ అదిరిపోయే డ్రెస్ తో ఎంట్రీ ఇచ్చింది.

ఈ ఈవెంట్ కి ఆమె ఒక అదిరిపోయే టైట్ ఫిట్ ప్యాంటు, లూజ్ షర్టులో అందాలు ఆరబోస్తూ కనిపించింది చూసేయండి.