మంచి ఆరోగ్యానికి  10 సూత్రాలు

మొట్టమొదటగా జంక్ ఫుడ్‌కి స్వస్తి పలకాలి. వీటి బదులు పండ్లు, కేరట్లు, వేరు శనగ లాంటివి తింటే ఎంతో మంచిది

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే.. శరీరంలో వృధాగా ఉండే కొవ్వు కరిగి, బాడీ ఫిట్‌గా ఉంటుంది

ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవాలి. లేకపోతే హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలూ వస్తాయి

రోజుకు రెండు కాఫీలు తాగితే.. టైప్ 2 డయాబెటిస్, మతిమరపు, అల్జీమర్స్ వంటి రోగాలకు చెక్ పెట్టొచ్చు

స్మోకింగ్ వల్ల కాన్సర్, నోట్లో కురుపులు వస్తాయి. కాబట్టి, స్మోకింగ్‌కి చాలా దూరంగా ఉండాలి

సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. మన వంటల్లో తప్పనిసరిగా వాడాలి

ఉదయాన్నే కడుపునిండా తినాలి. మధ్యాహ్నం కాస్త తక్కువ, రాత్రికి ఇంకాస్త తక్కువ తినాలి

డ్రై ఫ్రూట్స్ వారానికి మూడుసార్లైనా కొద్ది మొత్తంలో తినాలి. ఇవి ముసలి తనం రాకుండా కాపాడుతాయి

స్వచ్ఛమైన గాలి చాలా అవసరం. వీలైనంతవరకూ ప్రకృతిలో జీవించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండొచ్చు

అతిగా పని చెయ్యకూడదు, ఎక్కువ టెన్షన్ పడకూడదు. ప్రశాంతత కల్పించే కార్యక్రమాల్ని అప్పుడప్పుడు చూడాలి