మంచి పోషకాలుండే ఆహారాల్లో బచ్చలి కూర ముందు వరుసలో ఉంటుంది. బచ్చలికూరలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కళ్లు, మెదడు, గుండె తదితర విషయాల్లో బచ్చలికూర మనకు మరింత మేలు చేస్తుంది. ఎన్నో విటమిన్లు ఉంటాయి. ఖనిజాలకు బచ్చలికూర గొప్ప మూలం.
బచ్చలికూర తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో విటమిన్-ఏ, లుటిన్, కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు మెదడు డ్యామేజిని ఆలస్యం చేస్తుంది.
బచ్చలికూర రక్తపోటును నియంత్రిస్తుంది.
బచ్చలికూర కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బచ్చలికూరలో అధికమోతాదులో లుటిన్, జియాక్సంతిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి కంటిని అతినీలలోహిత కాంతి నుంచి దెబ్బతినకుండా కాపాడతాయి.
బచ్చలి కూరలో అధికమోతాదులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
ఆహారంలో భాగంగా బచ్చలికూరను వివిధ మార్గాల్లో తీసుకోవచ్చు. ఉడకబెట్టడం, వండటం, రసం లేదా స్మూథీ మాదిరిగా చేసుకొని కూడా తినవచ్చు.