బొప్పాయి పండు కంటే బొప్పాయి పండులో ఉండే గింజలే అధిక పోషకాలను కలిగి ఉంటాయని మీకు తెలుసా?.. ఆ గింజలలో ఉండే ఔషధ గుణాల గురించి, పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి గింజలను చాలా తక్కువ మోతాదులో తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ఈ బొప్పాయి గింజలు జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మనల్ని రక్షిస్తాయి.
బొప్పాయి గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
జీర్ణకోశంలో ఉండే బాక్టీరియాను చంపి జీర్ణకోశ సంబంధిత సమస్యల బారిన పడకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి.
నెలసరి సమయంలో స్త్రీలు బొప్పాయి గింజలను తీసుకోవడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలు ప్రసావానంతరం వీటిని తీసుకోవడం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి గింజలు చేదుగా ఉంటాయి. కనుక వీటిని చాలా మంది నేరుగా తినలేరు. అలాంటి వారు ఈ గింజలను పొడిగా చేసి ఆ పొడిని మనం తాగే జ్యూస్‌లలో కలుపుకుని తీసుకోవచ్చు.