'మొలతాడు లేని వాడు మగాడే కాదు' అని ఒక ప్రసిద్ధ సామెత ఉంది.

అసలు మగతనానికి - మొలతాడుకు సంబంధం ఏంటి? కట్టుకోకపోతే ఏమవుతుంది? 

మొలతాడు అనేది మొండానికి కట్టుకునే ఒక తాడు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించే మగవారు తమ నడుముకు నలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని కట్టుకుంటారు. 

మొలతాడు కట్టుకునే సాంప్రదాయం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. సాధారణంగా చెడు దృష్టి పడకుండా, దుష్ట శక్తుల నుంచి రక్షణగా మొలతాడు కట్టుకుంటారు.

స్నానం ఆచరించేటపుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు. కనీసం గుడ్డ అయినా ధరించాలని వేదాల్లో ఉంది. గుడ్డ ధరించాలంటే మొలతాడు ఉండాల్సిందే.

 ఆడవారికి మంగళసూత్రం ఎలాగో, మగవారికి మొలతాడు అలాగ. మహిళలకు కూడా చిన్నతనంలో సిగ్గుబిళ్లలా ధరింపజేస్తారు. పెళ్లయ్యాక వారికి మంగళసూత్రం వస్తుంది. ఇలా మగవారికి మొలతాడు అనే భావన ఏర్పడింది.

కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడును ధరించాలి. మొలతాడు కడుపులోకి వెళ్లే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది.

మొలతాడు బరువు పెరగటాన్ని తెలియజేస్తుంది. బిగుతుగా మారితే కొవ్వు పెరిగినట్లు, వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా సంకేతం.

నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది. వృషణాలు అధిక వేడికి గురయితే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది.

వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు.