గురువింద గింజల ను లక్ష్మి స్వరూపాలుగా భావిస్తారు. గురివింద గింజలు, ఆకులు, వేర్లు సాంప్రదాయ ఔషధం లో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు..
ఈ గింజలు విషపూరితమైనవి.గింజల పై ఉన్న పొట్టును తీసి అరగ తీసి ఇందులో నువ్వుల నూనె కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాయాలి. ఇలా రాయటం వలన త్వరగా వెంట్రుకలు మొలుస్తాయి.
పూర్తిగా జుట్టు ఊడిపోయి తలనున్నగా తయారైన వారు గురివింద చెట్టు ఆకులను తెచ్చి కొంచెంనీటితో మెత్తగానూరి ఆముద్దను బట్టతలపైన రోజు రుద్దుతూవుంటే వెంట్రుకలు మొలుస్తయ్.
గురివింద గింజల తో వేసే పొగ మన ఇంట్లో దోమలు పోతాయి. వారంలో రెండు రోజులు ఈ పొగ వేయడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా దోమలు గుడ్లు పెట్టకుండా చేస్తుంది.
గురువింద ఆకులను మెత్తగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది.
ఈ ఆకుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది. ఈ ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి.
ఈ ఆకులను నమిలి తింటే బొంగురు గొంతు సమస్యను నివారిస్తుంది. చక్కటి కంఠస్వరం వస్తుంది.
ఈ ఆకుల రసాన్ని తీసుకొని తెల్ల మచ్చలు ఉన్న చోట రాసి ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో ఉండాలి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే తగ్గిపోతాయి
ఈ ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో పోసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ప్రతిరోజూ ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగి.. జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
ఈ గింజలను చేతికి కంకణాలు, కాళ్ళకు కడియాలు చేపించుకొని కట్టుకుంటారు. వీటిని ధరించడం వలన గ్రహ దోషాలు కాకుండా నరదిష్టి కూడా తొలగిపోతుంది.
గమనిక: గురివిందలు విషతుల్యమైనవి కనుక వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి.