సీత.. ధైర్యానికి, ప్రేమకు నిదర్శనం.

ఇక తెలుగు సినిమాల్లో సీత పేరును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ పాత్రలో ఖచ్చితంగా దైర్యం, ప్రేమ ఉంటాయి 

టాలీవుడ్ లో .. సీత అనే పేరు గుర్తుకు రాగానే కొన్ని ఐకానిక్ పాత్రలు గుర్తుకు వస్తాయి. అవేంటో చూద్దాం 

సీత అనగానే గురొచ్చే మొదటి పేరు అంజలి దేవి. లవకుశలో ఆమె సీతగా కనిపించిన తీరు ఎంతో అద్భుతం

మీనా.. సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో సీతగా నటించింది. తాత ప్రేమ పొందడానికి ఎంతో దైర్యం చేసి.. కుటుంబానికి దగ్గరవుతుంది 

కమలినీ ముఖర్జీ.. గోదావరి సినిమాలో సీతగా మెప్పించింది. ఒకరి మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడడానికి, తాను ప్రేమించినవాడి కోసం సీతమ్మలా ఎదురుచూసింది 

రెజీనా.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో సీతగా నటించింది. ప్రేమించినవాడు మోసం చేసినా.. దేశం కానీ దేశంలో దైర్యంగా నిలబడి.. కుటుంబానికి ఎలాంటి పేరు రాకుండా కాపాడుకుంటుంది 

నయనతార.. శ్రీరామరాజ్యంలో నిజమైన సీతగా నటించింది. ఈ జనరేషన్ లో సీత అనగానే నయన్ మాత్రమే గుర్తొస్తుంది 

అంజలి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సీతగా నటించింది. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటుంది. బంధాలు ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటుంది

అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతగా నటించింది. ఊరు  ఇచ్చిన బాధ్యత కోసం పెళ్లాడబోయే బావను లక్ష్యం కోసం పంపిస్తుంది. అతని రాకకోసం సీతమ్మ ఎదురుచూసినట్లు ఎదురుచూస్తూ ఉంటుంది 

మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాలో సీతగా నటించింది. నిజమైన ప్రేమ కులమతాలు చూడదు అని నిరూపించింది. ఒక వ్యక్తిని ప్రేమిస్తే.. జీవితం మొత్తం మర్చిపోకూడదు అని నిరూపించింది. అతని జ్ఞాపకాల్లోనే బతికేస్తూ ఉంటుంది

కృతి సనన్.. ఆదిపురుష్ చిత్రంలో సీతగా నటించింది. ఒరిజినల్ రామాయణంలో సీతగా సరికొత్తగా కనిపించింది