వైన్, బీర్‌తో సహా అన్ని ఆల్కహాల్ పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
కొంతమంది ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు.
ప్రజల్లో తక్కువ అవగాహన ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బీర్, వైన్‌తో సహా అన్ని ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
క్యాన్సర్ ఎపిడెమియాలజీ, అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ ఈ అధ్యయనం ప్రచురించింది.
3,800 మందిపై ప్రభుత్వం చేసిన సర్వే ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది.
2013 -16 మధ్య, ఆల్కహాల్ వినియోగం 75వేల మందిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచింది.
దాదాపు 19,000 మంది క్యాన్సర్ సంబంధిత మరణాలకు కారణమైంది.
పది శాతం మంది వైన్.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పారు.